కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఇద్దరు చిన్నారులతో తండ్రి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు సెంటర్:-
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు పసిమొగ్గలను బలితీసుకున్నాయి. మనస్థాపానికి గురైన ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి చంపి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ శివారులో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి అనే వ్యక్తి, తన ఇద్దరు కొడుకులు విలాష్(5),వికేష్(3)లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంకో కూతురు తల్లి తోఉంది.కొంతకాలంగా కుటుంబంలో జరుగుతున్న గొడవలే ఈ విపరీత నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.
ఘటన వివరాలు వివరాలు
తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలం.
బాధితులు: కిన్నెర గుంశావలి మరియు అతని ఇద్దరు కుమారులు.వేప చెట్టుకు ఇద్దరు పిల్లలను ఉరివేసి, అనంతరం గుంశావలి కూడా ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు.
సమాచారం అందుకున్న వెంటనే తొర్రూర్ సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాలను కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల దర్యాప్తు ప్రాథమిక విచారణ ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగానే గుంశావలి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా విగతజీవులుగా పడి ఉండటంతో అమపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే చర్చించుకోవాలి కానీ, ఇలా పసిపిల్లల ప్రాణాలు తీసి, ఆత్మహత్యలకు పాల్పడటం పరిష్కారం కాదని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comment List