ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే

On

జనగాం  జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సంబంధించిన
 ‘ఉప సర్పంచుల ఫోరం’ తీవ్ర ఆగ్రహం
 వినతిపత్రం అందజేత
: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు ఉన్న ఉమ్మడి చెక్ పవర్‌ను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని ఉప సర్పంచుల ఫోరం ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. మంగళవారం మండల కేంద్రంలో ఉప సర్పంచుల ఫోరం ప్రతినిధులు స్థానిక ఎంపీడీవో  కలిసి  వినతిపత్రాన్ని అందజేశారు,. ఎలక్ట్రానిక్ మరియు ఆన్‌లైన్ మీడియాలో వస్తున్న వార్తలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో కొందరు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై గ్రామ నిధులను పక్కదారి పట్టిస్తూ, ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకున్న ఉదంతాలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి అక్రమాలకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే అప్పటి ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవర్ కల్పించిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఆ హక్కును కాలరాయాలని చూడటం అంటే... గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా, పాత అవినీతి రాజ్యానికి మళ్లీ తలుపులు బార్లా తెరవడమేనని ఫోరం ప్రతినిధులు మండిపడ్డారు.
ఊరుకునేది లేదు.. గట్టి బుద్ధి చెబుతాం!
గ్రామాల్లో ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా ఉండేందుకే ఉప సర్పంచుల భాగస్వామ్యం అవసరమని, దాన్ని దెబ్బతీయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత తప్పదని వారు స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటూ, ఉప సర్పంచుల హక్కులను కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రమాదకరమైన ఆలోచనలను పక్కనపెట్టి, ఉప సర్పంచుల గౌరవాన్ని, అధికారాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కొడకండ్ల ఉప సర్పంచ్ మొహమ్మద్ షన్న 
రంగాపురం ఉప సర్పంచ్ వెంకటయ్య,
నర్సింగాపురం ఉప సర్పంచ్ కప్పల రంగయ్య,
ఏడునుతుల ఉపసర్పంచ్ మహమ్మద్ యాకుబ్ పాషా,
రామావరం  ఉపసర్పంచ్ శ్రీనివాస్,
లక్ష్మక్క పల్లి ఉపసర్పంచ్ రెహమాన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
జనగాం  జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ‘ఉప సర్పంచుల ఫోరం’ తీవ్ర ఆగ్రహం వినతిపత్రం అందజేత: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచులకు ఉన్న...
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!
కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్