పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ
ఘన స్వాగతం పలికిన జిల్లా పోలీసులు
On
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా ప్రతినిధి ) జూలై 6 :జిల్లాలోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్లో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ సోమవారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి భవనాన్ని ప్రారంభించిన ఆయన, గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులను పరిశీలించి అధికారులతో డీజీపీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు అధికారిక పర్యటనల సమయంలో ఈ గెస్ట్ హౌస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీసు సిబ్బందికి మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 143
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2026 18:40:25
ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన భాగ్యమ్మ..
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
రంగారెడ్డి, జూలై 6, న్యూస్ ఇండియా ప్రతినిధి: తన పేరుపై...

Comment List