మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

On

మెదక్‌ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్‌ వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మన్‌రాజ్ అందించారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు వివిధ […]

మెదక్‌ జిల్లా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్‌ వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి.

చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది.

చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి మొదటి ఆరాధనను బిషప్‌ సాల్మన్‌రాజ్ అందించారు.

వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు తెలిపారు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దీవెనలు అందించేందుకు 15 మంది ఫాస్టర్స్‌ అందుబాటులో ఉండనున్నారు..

ఈ రోజు రాత్రి 9 గంటల వరకు చర్చి తెరిచి ఉంటుందని నిర్వహాకులు తెలిపారు.ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్‌ వేడుకకు మెదక్‌ చర్చి ముస్తాబవుతున్నది.

తినుబండారాలు, దుస్తులు, ఆటవస్తువులతో పాటు పలురకాల దుకాణాలు వెలిశాయి.

మరోపక్క రంగుల రాట్నాలు, బైక్‌లు, చిన్నచిన్న రైళ్లు చిన్న పిల్లలకు కనువిందు చేయనున్నాయి. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్‌ బొమ్మ ఆకట్టుకుంటున్నది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు