రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్..
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్..
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జనవరి 19, న్యూస్ ఇండియా ప్రతినిధి: రేషన్ బియ్యంతో దందా చేస్తే పిడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు రేషన్ డీలర్లు సీల్ విప్పని ప్రజా పంపిణీ బియ్యం సంచులను నేరుగా రేషన్ మాఫియాకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కడ్తాల్, అమన్‌గల్, ఎక్వాయ్‌పల్లి ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు రేషన్ బియ్యం అక్రమ రవాణానే జీవనాధారంగా మార్చుకుని, ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందన్న వివరాల నుంచి గుట్టుగా ఎప్పుడు తరలించాలన్నదాకా మాఫియా తరహాలో వ్యవహరిస్తున్నారని తెలిపారు. డీలర్లు అక్రమార్కులతో చేతులు కలిపితే వారి డీలర్‌షిప్‌ను రద్దు చేయడానికీ వెనుకాడబోమని రఘునందన్ స్పష్టం చేశారు.

Comment List