తెలంగాణకు నూతన డీజీపీ

On

తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌ నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఆయన నుంచి అంజనీకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు. ఆయనకు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ డీజీగా […]

తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌ నియమితులయ్యారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది.

ఆయన నుంచి అంజనీకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు.

Read More టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

ఆయనకు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు

. హైదరాబాద్‌ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి కొంతకాలం అనారోగ్యంతో సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్‌ ఇన్‌చార్జి డీజీపీగా సేవలందించారు

. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను డీజీపీగా నియమించడం ఓ ఆనవాయితీగా మారింది. అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి అలా హైదరాబాద్‌ సీపీ స్థానం నుంచి డీజీపీలుగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి ఏపీలో పలుమార్లు కొనసాగిన ఆనవాయితీ ప్రకారం ఈ సారి ఏసీబీ డీజీని డీజీపీగా నియమించారు.

Views: 11
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే