కాలం అన్ని గుర్తు పెట్టుకుంటుంది బాబు
క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
వెంటాడుతునన అవినీతి కేసులు
కాలం అన్ని గుర్తు పెట్టుకుంటుంది.. అనే దానికి ఇది మరో ఉదాహారణ మాత్రమే.. టీడీపీ నేతలు అప్పట్లో జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తాడు అంటూ చాలా హేళనగా మాట్లాడారు గుర్తుందా.. జగనన్నకి గుర్తుందో లేదో గానీ.. కాలం కదా అన్ని గుర్తుపెట్టుకుంది.. ఇప్పుడు అదే శుక్రవారం వడ్డీతో సహా చంద్రబాబుకి తిరిగిచ్చేసింది.. స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యి జైల్లో ఉన్న చంద్రబాబుకి శుక్రవారం పట్టపగలే చుక్కలు కనిపించాయి.. ఏ కోర్టుకు అయితే జగన్ వెళ్తాడంటూ వెక్కిరించారో.. అవే కోర్టుల్లో ఇవాళ బ్యాక్ టూ బ్యాక్ ఝలక్‌లు తగిలాయి. మొదటగా శుక్రవారం ఉదయం బాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు 2 రోజులు పొడిగించింది. ఇక మధ్యాహ్నం హైకోర్టు బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఒక్క మాటతో కొట్టేసింది. మరికాసేపటికే బాబుని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.. కాలానికి అన్ని గుర్తున్నాయి బాబు.. ఇంకా తిరిగిచ్చేయాల్సినవి చాలానే ఉన్నాయి.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List