ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి

నిమజ్జనంలో డిజే సౌండ్ నిషేధం..

On
ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి

IMG-20230927-WA1450
అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ మన్మోహన్

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఇనాంగూడలోని భైరాంఖాన్ చెరువులో గణేష్ నిమ్మజ్జన ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం నిర్వాహించుకోవాలని అబ్దుల్లాపూర్మెట్ సీఐ మన్మోహన్ తెలిపారు. బుధవారం ఇనాంగూడ చెరువు వద్ద సిఐ మన్మోహన్ తన సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మన్మోహన్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల నిఘానేత్రంలో నిమ్మజనం జరుగుతుందన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బంధబస్తు పెట్టడం జరిగిందన్నారు. విగ్రహాలను చెరువులో నిమజ్జనంకు తరలించేందుకు చెరువు వద్ద మూడు క్రేన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. విగ్రహాలను నిమజ్జనం కొరకు చెరువు వద్దకు వాహనాలు వెళ్లే దారి ఒక మార్గంలో నిమజ్జనం అనంతరం బయటకు వచ్చే మార్గం మరొక మార్గం ఉంటుందని, సూచిక బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. విగ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో గురువారం నిర్వహించే నిమజ్జనంలో డిజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధమని తెలిపారు. ఉత్సవాలలో ఎట్టి పరిస్థితుల్లో డిజె సౌండ్ సిస్టంకు అనుమతి లేదన్నారు. డిజే సౌండ్ సిస్టం వినియోగించే వారిపై కేసు నమోదు చేసి సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఎవరైనా డిజె వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో హాజరై మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నిమజ్జనం సమయంలో సాధారణ ప్రజలకు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో వాహనంలో పెద్ద కర్రలు, ఆయుధాలు వంటివి తీసుకెళ్లకూడదని తెలిపారు. విగ్రహాలను చెరువు వద్దకు తీసుకొని వెళ్లినప్పుడు వాహనంలో ఎక్కువమంది వెళ్లరాదు అని తెలిపారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరిగిన వెంటనే అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712662650, పెట్రోల్ మొబైల్ ఫోన్ నెంబర్లు 8712662651/652 కు సమాచారం అందించాలని అన్నారు. డయల్ 100, లోకల్ సంబంధిత పోలీ స్టేషన్ అధికారులకు సమాచారం అందించగలరని కోరారు. గురువారం ఉదయం 6:00 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6:00 గంటల వరకు వైన్స్ షాప్లు, కళ్ళు దుకాణాలు, బార్లు మూసివేయాలని రాచకొండ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే