ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని బీసీ కులాలు అభివృద్ధిలోకి రావాలి

నాయీ బ్రాహ్మణ "వెబ్ పోర్టల్" ఆవిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.

On
ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని బీసీ కులాలు అభివృద్ధిలోకి రావాలి

ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను అందిపుచ్చుకొని బీసీ కులాలు అభివృద్ధిలోకి రావాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.

వృత్తుల ఆధునీకరణ, వృత్తి పరికరాలలో నవీకరణ, సాంకేతిక నైపుణ్యాలు, వృత్తులలో నిపుణత సాధించే దిశగా నూతన సాఫ్ట్ వేర్ లను ఉపయోగించు కోవలసిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్  వకుళాభరణం సూచించారు.
సోమవారం నాడు కాచిగూడ లోని ఓ ప్రముఖ హోటల్ లో నాయీ బ్రాహ్మణ డాట్ కామ్ సంస్థ రూపొందించిన నాయీ బ్రాహ్మణ "వెబ్ పోర్టల్". మన  "ఇ క్స్పర్ట్ ఇన్ ఆప్ "ను. ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సంస్థల వ్యవస్థాపకుడు నడి గొట్టు సంతోష్ కుమార్ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఆత్మీయ అతిథులుగా సాంకేతిక నిపుణులు కళ రాజ్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మర్రి. శ్రీనివాస్, ఎన్ .తిరుపతి
రాకేష్ చేర్యాల తదితరులు పాల్గొన్నారు.
   నాయీ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవారికి, విద్యా, ఉద్యోగ రంగాలలోని వారికి, సామాజిక, రాజకీయాలలోని వారికి సంబంధించిన అన్ని అంశాలకు సంపూర్ణమైన సమాచారాలను  ఈ వెబ్ పోర్టల్ లో, ఆప్ లో అందుబాటులో ఉంచడం గొప్ప విషయం అని డాక్టర్ వకళాభరణం నిర్వహకూలను అభినందించారు.
"Manaexpertin"అప్ www.Nayeebrahmana.com పోర్టల్ లో.ఉచితంగా తమ వివరాలను నమోదు చేసుకుని అన్ని సౌకర్యాలను, ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చని ఫౌండర్ నడిగోట్టు సంతోష్ కుమార్ తెలిపారు.

Views: 48
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News