మీసేవకుడనై ఉంటా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి

మీసేవకుడనై ఉంటా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిళ్ళ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి రోడ్ షోలో పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

IMG_20231109_215228
ప్రసంగిస్తున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి

. ఈ పేద ప్రజలు భాగుపడాలంటే నీళ్లు నిధులు నియామకాలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత పదేళ్ల కాలంలో కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏ ఒకటి అమలు చేయలేదనీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, ఏక కాలంలో రుణమాఫీ చేయలేదని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన మాట మర్చిపోయారని ఆయన అన్నారు. అందుకే ఈ దగా పడ్డ తెలంగాణను బాగు చేయాలంటే కష్టం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. అదేవిధంగా వివిధ పార్టీల నుంచి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారందరినీ సాదరంగా ఆహ్వానించి కండువాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 203

Post Comment

Comment List

Latest News