ఒకసారి ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా
ఖేడ్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంగప్ప
మీ గడపకు వచ్చిన నన్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో దీవించి ఆశీర్వదించాలని ఖేడ్ బీజేపీ పార్టీ అభ్యర్థి జెనవాడే సంగప్ప ప్రజలను కోరారు బుధవారం కంగ్టి మండలంలోని పలు గ్రామాల్లో అయన సుడిగాలి పర్యటన చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు.70ఏళ్లుగా మూడు కుటుంబాలే నారాయణాఖేడ్ ను ఎలుతున్నాయని, అవినీతి, అక్రమాలు అరాచకాలు చేశారే తప్ప అభివృద్ధి చేయలేదు అన్నారు.యువతను, పేద ప్రజలను పట్టించుకోలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లీడర్లను తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని, ఖేడ్ లో కాషాయ జెండా రేపరేపాలడాలని అయన తెలిపారు.ప్రతి స్కీమ్ ను కేసీఆర్ స్కామ్ గా మార్చిండని సంగప్ప విమర్శించారు.రాష్ట్రంలో కుటుంబ పాలనను తరిమికొట్టాలని అన్నారు. నన్ను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తెస్తానని సంగప్ప హామీ ఇచ్చారు.
Comment List