కొత్తగా పెళ్లైన వాళ్ల కోసం ఈ సుత్రాలు..!!

పాటిస్తే లైఫ్ బిందాసే

By Teja
On
కొత్తగా పెళ్లైన వాళ్ల కోసం ఈ సుత్రాలు..!!

మీకు ఇటీవలే వివాహం అయ్యిందా? భవిష్యత్​ కోసం బంగారు కలలు కంటున్నారా? అయితే ఇది మీ కోసమే. జీవితం ఆనందమయంగా ఉండాలంటే.. కొత్త జంట కచ్చితంగా మంచి ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందామా?

యువతీ, యువకులు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. నిన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లున్నవారు, పెళ్లి తరువాత ఉమ్మడిగా సంసార భారాన్ని మోయాల్సి ఉంటుంది. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ ఒక మంచి అవగాహనతో ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే భవిష్యత్​ బంగారుమయం అవుతుంది.

Just Married png images | PNGEgg

ధనం మూలం ఇదం జగత్​

డబ్బు లేనిదే జీవితం లేదు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. ఇదే నిజం. కనుక భవిష్యత్​ కోసం ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. వాస్తవానికి పెళ్లయిన వెంటనే డబ్బు గురించి మాట్లాడటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ, ఈ విషయంలో ఎలాంటి మొహమాటానికి తావులేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Read More నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.., సెక్షన్ 144/ 163 BNSS అమలు.

భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన ఆర్థిక చర్చ.. వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కనుక కొత్త జంట.. ఆర్థిక విషయాలపై తమ జీవిత భాగస్వామి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తరువాత తామిద్దరూ ఇష్టపడే సాధారణ పెట్టుబడుల గురించి మొదటగా చర్చను ప్రారంభించాలి.

Read More కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

అభిప్రాయాలు భిన్నంగా ఉండొచ్చు!

Read More అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.


పొదుపు, పెట్టుబడులు, జీవిత లక్ష్యాల విషయంలో వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కనుక కొత్తగా పెళ్లైనవారు.. తమ అభిప్రాయాలను సమన్వయం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎలాంటి ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే.. భవిష్యత్ సురక్షితంగా ఉంటుందో నిర్ణయించుకోవాలి.

వాస్తవానికి ఒక జంటగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం తొలి రోజుల్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వ్యక్తుల.. వ్యక్తిగత, ఆర్థిక లక్ష్యాలు భిన్నంగా ఉండవచ్చు. అందుకే భాగస్వామితో మీ లక్ష్యాల గురించి స్పష్టంగా చెప్పాలి. అలాగే మీ భర్త/ భార్య అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. అందులో ఉమ్మడిగా ఉన్న వాటిని ఒక చోట రాసి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇల్లు కొనడం, విహార యాత్రలకు వెళ్లడం, పదవీ విరమణ కోసం పొదుపు, తొందరగా పదవీ విరమణ లాంటి లక్ష్యాల గురించి చర్చించుకుని, ఒక పటిష్టమైన ప్రణాళిక వేసుకోవాలి.

ఆర్థిక పరిస్థితులు తెలుసుకోండి!
కొత్త జీవితం ప్రారంభమైన వెంటనే ఆదాయం, అప్పులు, ఖర్చులు, వ్యక్తిగత అలవాట్లు తదితర ఆర్థిక అంశాలను చర్చించుకోవడానికి చాలా మంది సంకోచిస్తారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఆర్థిక విషయాలను నిజాయితీగా చర్చించుకోవాలి. నిజాయతీగా ఉండటం వల్ల దంపతుల మధ్య పరస్పర విశ్వాసం పెరుగుతుంది. అలాగే మీరు ఆర్థికంగా ఎక్కడున్నారో తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. సురక్షితమైన భవిష్యత్‌ను నిర్మించుకునేందుకు వీలు కలుగుతుంది.

బ్యాలెన్స్ చేసుకోవాలి!


ఖర్చు చేసే విషయంలో వ్యక్తుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకరు పొదుపు చేస్తుంటే, మరొకరు దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తుంటారు. అలాగే ఒకరికి పెట్టుబడులపై మంచి అవగాహన ఉంటే.. మరొకరికి పొదుపు చేయడంపై దృష్టి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దంపతులు తమ మధ్య సమన్వయం సాధించడం చాలా అవసరం. వాస్తవానికి ఒక వ్యక్తి బలం, మరో వ్యక్తి బలహీనతను దూరం చేయగలగాలి. అప్పుడే ఆర్థిక విషయాలపై మెరుగైన నియంత్రణ సాధించేందుకు వీలవుతుంది. ఫలితంగా భవిష్యత్ ఆర్థికంగా బాగుంటుంది.

Views: 98

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.