పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం, చిన్న వంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో ఎర్రబెల్లి ఎన్నికల ప్రచారం

  తెలంగాణ ప్రాంతంలో సాగు త్రాగునీరు లేక అలమటిస్తున్న తరుణంలో సాగునీరు తీసుకొచ్చి చెరువులను నింపడంతోనే భూగర్భ జలాలు ఉబికి వచ్చి బోర్లు,బావులలో నీరుచేరి పంటలు విరివిగా పండుతున్నాయని ఇదంతా సీఎం కెసిఆర్ తోనే సాధ్యమైందని ఎర్రబెల్లి అన్నారు.

మహబూబాబాద్  జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం, చిన్నవంగర.చిట్యాల గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టి ఎమ్మేల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావు.ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, డా  యన్ సుధాకర్ రావు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 10ఎండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి పనులు చేసిందని అందరూ విశ్లేషణ చేసుకోవాలనీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో 6గంటల కరెంటు ఇచ్చేదని, ఆ 6గంటల కరెంట్ కూడా రెండు దఫాలుగా పొద్దటి పూట 3గంటలు రాత్రివేళల్లో 3గంటలు ఇచ్చేదని,  ఆరు గంటల కరెంటు తో బోర్లలో నీళ్ళు వెళ్ళకపోయేదని, ఇయ్యాల బొర్లలో,చెరువులు,బావులలో నీళ్ళు పుష్కలంగా ఉండడంతో 24గంటలు మోటార్లు పెట్టిన కూడా నీళ్ళు ఓడవ కుండా ఉన్నాయంటే కేసీఆర్ చలువ కదా ఒకసారి ఆలోచన చేయాలన్నారు.కేసీఆర్ ను మర్చిపోవద్దన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బిఅర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గెలుపించాలని కోరారు.

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News