తెలంగాణ ఫలితాలు ఏపీలో ప్రభావం చూపిస్తాయా?

ఏపీలో జగన్ రెండోసారి వస్తాడా?

On

టీడీపీ త్రిశూల వ్యూహం ఏంటి?

WhatsApp Image 2023-12-04 at 7.33.30 PM

తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఏ మాత్రం ఉండదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ, కొట్లాడి  తెచ్చుకుంది TRS. తెలంగాణ ప్రజలు రెండుసార్లు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ ఏపీలో  చంద్రబాబు రెండోసారి ఓడిపోయారు. మరి పోలిక  ఎక్కడ ఉంది? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇచ్చారు అంతే. 

నిజానికి, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కనీసం 30 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే గెలిచేది. ఉదాహరణకు 12 మంది ఎమ్మెల్యేలను మారిస్తే వారిలో  9 మంది గెలిచారు. కాబట్టి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్లే టీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఏపీ విషయానికి వస్తే.. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్లుగా దూసుకుపోతున్నాడు జగన్‌.  

పరిశ్రమలు–పెట్టుబడులు
బాబు హయాంలో  రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్‌ పాలనలో ఇప్పటికే రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 

Read More దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

ఉద్యోగాలు
బాబు హయాంలో  ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు–34 వేలు
జగన్‌ పాలనలో  ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు–2.14 లక్షలు
(స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి జగన్‌ సీఎం అయ్యేదాకా రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా, జగన్‌ కొత్తగా 2.14 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు)

Read More అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...

గ్రామ స్వరాజ్యం
15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు, 10 వేల విలేజ్‌ క్లినిక్స్, వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు

విద్య
నాడు–నేడు కింద 40 వేల స్కూళ్ల ఆధునీకరణ, సీబీఎస్‌ఈ, టోఫెల్‌ శిక్షణ, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ వంటి సంస్కరణలు చేపట్టి రూ.70 వేల కోట్లు ఖర్చు చేశారు. 

వైద్యం
నాడు–నేడు కింద రూ.16 కోట్ల వ్యయంతో 17 మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ. ఇప్పటికే 5 మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. 

సామాజిక న్యాయం
బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని భావించి బీసీలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు 8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే, జగన్ 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. 
చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు, కానీ 4 బీసీలను జగన్‌ రాజ్యసభకు పంపారు. 

ఇళ్ల పట్టాలు–ఇళ్లు
చంద్రబాబు పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు
కానీ జగన్‌ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అందులో  22 లక్షల ఇళ్లు నిర్మాణం మొదలుకాగా, 5 లక్షల ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులు ఇచ్చారు. మొత్తంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం జగన్‌ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది 

దళితులు
చంద్రబాబు 2 దళితులకు మంత్రి పదవులు ఇస్తే, జగన్‌ 5 మంది దళితులకు(హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా) మంత్రి పదవులు ఇచ్చారు. మైనారిటీలకు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. 

మేనిఫెస్టోలో ఉన్న 99 శాతం హామీలను అమలు చేశారు. 
చంద్రబాబు భూ సమస్యలు సృష్టిస్తే 100 ఏళ్ల తరువాత సమగ్ర భూసర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపించారు. 

జనాభాలో  70 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గుండెల్లో గూడు కట్టుకున్న జగనన్న ఒంటరిగా ఎదుర్కోలేమని భావించిన బాబు ఆయన దత్తపుత్రుడు పొత్తుతో వస్తున్నారు. ఎవరెన్ని పొత్తులతో వచ్చినా జగనన్న విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు

Views: 7

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News