వైఎస్ భారతికి పెదపాటి అమ్మాజీ శుభాకాంక్షలు
ఘనంగా వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు
ఎస్.రాయవరం మండలంలో పెనుగల్లులో కేక్ కట్ చేసి వేడుకలు జరిపిన వైసీపీ నేతలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య శ్రీమతి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా ఎస్ . రాయవరం మండలంలో ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ కేక్ కట్ చేసి వైఎస్ భారతి పుట్టినరోజు వేడుకల్ని వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘనంగా జరిపారు.
భర్త ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తున్న భారతమ్మ.. జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో మండలానికి చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List