మధ్యాహ్నం భోజనం కార్మికుల పెండింగ్ జీతాలు బిల్లులు వెంటనే ఇవ్వాలి

సిఐటియు జిల్లా మాజీ అధ్యక్షులు అతిమేల మానిక్

On
మధ్యాహ్నం భోజనం కార్మికుల పెండింగ్ జీతాలు బిల్లులు వెంటనే ఇవ్వాలి

కంగ్టి, న్యూస్ ఇండియా తెలుగు

IMG-20240118-WA0053సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలలోని తాసిల్దార్ కార్యాలయం ముందు గురువారం మధ్యాహ్న భోజనం కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం డిప్యూటీ తాహాసిల్దార్ జుబేర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా సిఐటియు మాజీ జిల్లా అధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వంటలని పెడుతున్న మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట పిల్లలకు ఫలహారం కూడా పెడుతున్నారు ప్రభుత్వం చేయడం లేదు కానీ కార్మికుల అప్పులు చేసి పిల్లలకు వంటలు పెడుతున్నారు అన్నారు కొన్నిచోట్ల హెడ్మాస్టర్లు మధ్యాహ్న భోజనం కార్మికులకు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు బిల్లులు వెంటనే ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని కనీస వేతనాలు వెంటనే ఇవ్వాలని ఉదయం పదహారానికి ప్రభుత్వమే సరుకులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చందోటి సతీష్ కెవిపిఎస్ మండల అధ్యక్షులు రాహుల్ ఎస్ఎఫ్ఐ మండల ఇన్చార్జ్ పవన్ యూనియన్ నాయకులు గంగమని శోభ మోతిబాయి లక్ష్మి సంగమ్మ సావిత్రి మధ్యాహ్న భోజనం కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Views: 143
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక