సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!

- మృతదేహాన్ని రప్పించాల్సిందిగా కోటపాటికి వినతి

On
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!

ఇందూరు, ఫిబ్రవరి22, న్యూస్ ఇండియా ప్రతినిధి

కామారెడ్డి జిల్లా గాంధారివాసి చాకలి పోశయ్య (48) సౌదీ అరేబియాలో రియాజ్ కు వెయ్యి  కిలోమీటర్ల దూరంలో ఎడారిలో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. గత అనేక సంవత్సరాలు  గా అక్కడే పని చేస్తున్నాడు. ఇటీవల రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి పది రోజుల క్రితం సౌదీ కి వెళ్ళిన పోశయ్య మనస్తాపంతో అతను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అక్కడే పని చేస్తున్న మరొక వ్యక్తి నిన్నటి రోజున సమాచారం ఇచ్చాడు. పోశయ్య కు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని సంప్రదించి స్థానిక BRS నాయకులు H తానాజీ రావు ను సంప్రదించగా, వారు B. B పాటిల్ M. P గారిని సంప్రదించి, అనంతరం మృతదేహాన్ని తెప్పించవలసిందిగా " ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక " అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడుని అభ్యర్థించి, సహాయపడవలసిందిగా కోరారు. కుటుంబ సభ్యులను ఆర్మూర్ కు పంపి కావలసిన పత్రాలు సమర్పించారు.  వెంటనే స్పందించిన కోటపాటి అటు సౌదీలోని ఇండియన్ ఎంబసీ, ఇటు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ పంపారు. సౌదీలోని కమ్యూనిటీ కోఆర్డినేటర్ సయ్యద్ అబు ఫరస్ గారికి మృతదేహాన్ని పంపడానికి అధికారం ఇస్తూ నియమించడం జరిగింది. త్వరలోనే మృతదేహాన్ని పూర్తి ఖర్చులు భరించి యజమాని పంపే విధంగా చర్యలు తీసుకుంటామని ఇండియన్ ఎంబాసి రియాద్ నుండి జవాబు పొందడం జరిగింది.

Views: 218
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'