జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

On
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

హైదరాబాద్, ఫిబ్రవరి25, న్యూస్ ఇండియా ప్రతినిధి

కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్. శంకర్ పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత  సీఎం రేవంత్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. 20240225_215615

భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎలాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఇవాళ(ఆదివారం) సాయంత్రం తుర్కయంజల్ లోని శంకర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన… కొడంగల్ లో రైతులకు సంబంధించిన భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందన్నారు. భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్ పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని ఆరోపించారు కేటీఆర్. అయితే స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు. శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన పైన దాడికి తెగబడిందని ఆరోపించారు. 20240225_215619

శంకర్ ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హాత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం పక్షపాతం చూపించారన్నారు. పోలీసుల పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీని కేటీఆర్ కోరారు.

Views: 48
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.