కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
కాంగ్రెస్ చెప్పే మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో
*👉కాంగ్రెస్ చెప్పే మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో*
*👉కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి!*
*👉సమిష్టిగా కృషి చేస్తే వరంగల్ పార్లమెంట్ మనదే..ఉద్యమకారుడు మారేపల్లి సుధీర్ కుమార్ గారిని వరంగల్ ఎంపీగా గెలిపిద్దాం*
*👉గులాబీ సంద్రంగా మారిన తొర్రూరు మండలం..వేల సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు*
*👉కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో నమ్మకం పోయింది*
*👉ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్, బీజేపీలు చేసిన మోసాలపై చర్చించండి*
*👉మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు*
ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడుదామని మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పి ఎస్ ఆర్ స్కూల్ మైదానంలో పాలకుర్తి నియోజకవర్గ వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించింది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
రాష్ట్రంలో 8 నుంచి 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి.
కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్ల ఇద్దరు ముసళోళ్లు ఉండే ఇద్దరికీ 4 వేలు ఇస్తా అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్న మాటను గుర్తు చేసుకోవాలె. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తా అని కొత్త పాట ఎత్తుకున్నాడు.రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో కొత్త వాయిదా పెట్టిండు. రుణమాఫీ కావాలన్న, రూ. 2500 కావాలన్న, ముసలోళ్లకు రూ. 4 వేలు కావాలన్నా బీఆర్ఎస్ గెలవాల్సిందే. లేదంటే రేవంత్ రెడ్డి ఉన్న అన్ని పథకాలను ఇచ్చ కొట్టుడు ఖాయం. రైతు బంధు ఏమైందయ్యా అంటే ఓ మంత్రి చెప్పుతోని కొడుతా అంటాడు. గౌరవ కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 70 వేల కోట్ల రూపాయల జమ చేసిండు.
రైతులు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరముంది.
కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపు నిండా నీళ్లు, 15 రోజుల్లో పంట కొనుగోళ్లు ఉంటుండె. కాంగ్రెస్ వచ్చింది. కరువును తీసుకొచ్చింది. ఇవ్వాల గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యాం. బీజేపీ, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా? అని అన్నారు.
మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.కొంతమంది పార్టీ వదిలి వెళ్లే నాయకులు ఉన్నప్పటికీ...కార్యకర్తలు మాత్రం బలంగా ఉన్నారు.రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే..
కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నీళ్లందక ఎండిన పంట పొలాలతో రైతులు గోసపడుతున్నారు.గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని... ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది అని రైతులు గగ్గోలు పెడుతున్నారు అని తెలిపారు.
60 ఏళ్లుగా జరగని అభివృద్ధి గత 10 సంవత్సరాలలో అన్ని రంగాల్లో మన పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందింది.గత ఐదు సంవత్సరాలలో 4200 కోట్లతో పాలకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చేశామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో బస్సు మినహా అంతా తుస్సే. ఏమైంది మీ హామీలు.. ఏమైంది మ్యానిఫెస్టోలో ఇచ్చిన పథకాలు.అసలు వస్తాయా అన్న సందేహం ప్రజల్లో వచ్చేసింది.కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తుక్కు తుక్కుగా ఓడిస్తారని దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 తేదీ లోపు రుణమాఫీ చేస్తావా, చేయవా? ప్రజలకు తెలియజేయాలి,చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి.ఏదో ఒకటి చేయి.కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటు వేయరు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు పించన్ రూ.4 వేలు వేస్తా అని ఇవ్వలేదు. ప్రజలకు బాకి ఉన్నారు.రాష్ట్రంలో మహిళలందరికీ రూ.2500 ఇస్తా అన్నావ్ ఇవ్వలేదు, రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ రూ.10 వేలు బాకీ పడింది.కాంగ్రెస్ తీరు ఓడ దాటే దాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లు ఉంది.ప్రజలు మోసపోతారు అని రేవంత్ రెడ్డి బహిరంగంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పారు.కానీ ప్రజలు ప్రతిసారి అలా మోసపోరు రేవంత్ రెడ్డి అది గుర్తు పెట్టుకోండి.
కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి. ప్రజలు కేసిఆర్ వైపు, మీ వైపు చూస్తున్నారు, ప్రజలకు కాంగ్రెస్ అబద్ధాలు, మోసాలను చెప్పండి.కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటిలను అమలు చేయలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారు.కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని దించాలంటే వారిని ఓడించాల్సిన అవసరం ఉంది. గ్యారెంటీ లను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు పూర్తి సమయం దాటిపోయిన వాటిని అమలు చేయలేదు. కాంగ్రెస్ తప్పిదాల కారణంగా రాష్ట్ర ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రజా పాలన అని సిఎం ఒక్కరోజు ప్రజలను కలిసి ఆ తరువాత గేట్లు వేపించారు.కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటినాయి.చేతలు మాత్రం గడప దాటడం లేదు.మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ఊరంతా చుట్టి వచ్చినాయి, మన నిజం మాత్రం గడప కూడ దాటలేదు. చెప్పుకోవడంలో మనం విఫలం చెందినం.కాంగ్రెస్ పార్టీనీ బొంద పెట్టేందుకు ప్రజలు మే 13 కోసం ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం.కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని బస్సు యాత్ర మొదలు పెట్టారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు పిల్లర్లు పాడైతే వాటిని మరమ్మతులు చేయాల్సింది పోయి నీరు మొత్తం సముద్రంలోకి విడిచి పెట్టారు.కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అనవసరంగా గెలిపించామని తల పట్టుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ మారేపల్లి సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని సురేందర్, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరియు వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని సభను విజయవంతం చేశారు అని అన్నారు.
Comment List