ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
స్వాగతించిన సీపీఐ(యమ్-యల్) లిబరేషన్
మామిండ్ల రమేష్ రాజా
ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ చేసిన తీవ్ర అభియోగాలను తోసిపుచ్చుతూ జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం స్వాగతించదగిన విషయం.ప్రతిపక్ష పార్టీలను వారి ఎన్నికల ప్రచారాన్ని అస్థిర పరిచేందుకు బిజెపి కుట్రగా పూరితంగా ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉపయోగించింది. బీహార్ లో సిపిఐ (యమ్-యల్) లిబరేషన్ కు చెందిన అజియోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ మరియు 22 మంది ఇతర సహచరులపై రాజకీయ దురుద్దేశం తో కేసులు పెట్టి దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఆవిధంగా మనోజ్ మంజిల్ ను జైలు పాలుచేసి అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేయించారు.ఈ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని ఇండియా కూటమి ఎన్నికల ప్రచారాన్ని పాడు చేసేందుకు వుద్దేశించబడిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఉత్తర్వు రుజువు చేస్తుంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కూడా వెంటనే విడుదల చేయాలని మేము కోరుతున్నాము.రాజ్యాంగం పైనా ప్రజల జీవితాల పైనా ఫాసిస్ట్ దాడికి పాల్పడిన మోడీ పాలనకు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సిపిఐ (యమ్-యల్) లిబరేషన్ ప్రజలకు పిలుపునిస్తుంది.
Comment List