వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

On
వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా)జూన్ 22: లక్ష్మీదేవిపల్లి  మండలం కారుకొండ గ్రామపంచాయతీలో వరకట్న వేధింపులతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాల బోయిన మానస(20)సూర్యాపేట జిల్లా నడిగూడెం బృందావనపురం గ్రామానికి చెందిన యువతికి లక్ష్మీదేవిపల్లి మండలం  కారుకొండ గ్రామానికి చెందిన సంతోష్ తో వివాహం జరిగింది. కొన్ని నెలల పాటు వీరి దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉండి ఒక బాబు కూడా జన్మించాడు. సంవత్సరం తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించడంతో యువతి శుక్రవారం రోజు పురుగుల మందు తాగింది స్పందించిన స్థానికులు కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళుతుండగా మార్గ మధ్యలో మృతి చెందింది యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 280
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.