అంతరరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

అంతరరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

11,20,000/- రూపాయలు విలువ గంజాయి స్వాదినం

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS


ఈరోజు అనగా తేదీ 20.07.2024 రోజున మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో  ఎస్.ఐ జగదీష్ మరియు సిబ్బందితో  దుబ్బ తండ దగ్గర ఉదయం 9 గంటల సమయాన వాహనాలను తనిఖీ చేయగా, ఒక బొలెరో వాహనం అనుమానాస్పదంగా, స్పీడ్గా వస్తుండగా అట్టి వాహనాన్ని ఆపి, అందులోని నలుగురు (ఇద్దరు మగ & ఇద్దరు ఆడ మనుషులు) పారిపోయేందుకు ప్రయత్నం చేయగా, వెంటనే వారిని అధువులోకి తీసుకొని వారి బొలెరో వాహనం చెక్ చేయగా, అందులో వెనకాల మూడు ప్లాస్టిక్ సంచులలో నిండా 33 ప్యాకెట్ల గంజాయి లభించింది.

Read More జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’

వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా,

Read More సరూర్నగర్ లో దారుణం..

1) ప్రహ్లాద్ సిసా, S/o జగబంధు సీసా, వయస్సు: 36 సంవత్సరాలు, ST-ఆదివాసి, R/O కాంతి గ్రామం, బాదెల్ పోస్ట్, పాడువ మండలం, కోరాపుట్ జిల్లా, ఒడిసా రాష్ట్రం,

Read More ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

2) అప్పన్న బైరాగి, S/o Mngu బైరాగి, వయస్సు; 36 సంవత్సరాలు, కులం ST ఆదివాసి, బోక్ మెకానిక్, R/ ౦ కితుబా గ్రామం, బార్డేల్ పోస్ట్, కొరాపుట్ జిల్లా, ఒడిసా రాష్ట్రం,

3) మిథులా సిసా, D/o సోను సినా, వయస్సు: 21 సంవత్సరాలు, R/O మహదా గ్రామం, బలేల్ పోస్ట్, మాచ్ కుడా ఉప జిల్లా, కోరాపుట్ జిల్లా.

4) బసౌతి పాంగి, D/o పడలం పాంగి, మహదా గ్రామం, బలేల్ పోస్ట్, మచ్కుడ ఉప జిల్లా, కోరాపుట్ జిల్లా. అని తెలపడం జరిగింది.గత ఇటీవల ప్రభుత్వ నిషేదిత గంజాయి వ్యాపారం చేస్తున్నాను,తరుచుగా ఒరిస్సా నుండి తెలంగాణ హైదరాబాదులో అమ్ముకుంటామని, అదే విధంగా ఈ రోజు కూడా గంజాయి ప్యాకెట్లను ఒడిస్సా నుండి తీసుకుని రాజమండ్రి విజయవాడ, కోదాడ సూర్యాపేట దంతాలపల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

వీరి వద్ద మొత్తం గంజాయి సుమారుగా 60 కిలోల విలువ సుమారుగా రూ. 11,20,000/- రూపాయలు(Per Kg 20000/-) ఉంటుంది. గంజాయి తరలించడానికి వాడిన బొల్లెరో టర్బో బేరింగ్ నెం: AP39G3761 ను మరియు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనపర్చుకొని నిందితులను రిమాండుకు తరలించడం జరిగింది.

చాకచక్యం గా వ్యవహరించిన గంజాయి నిందితులను పట్టుకున్న ఎస్.ఐ జగదీష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.

మీడియా సమావేశంలో తొర్రుర్ సీఐ సంజీవ, ఎస్.ఐ జగదీష్, దంతాలపల్లి ఎస్.ఐ రాజు, ఎస్.ఐ క్రాంతి కిరణ్, సిబ్బంది ఉన్నారు.

Views: 168
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని చింతలపల్లి రోడ్డు శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో...
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..