ఆపద్బాంధవుల్ల.. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబము ప్రాణాలను కాపాడిన వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు..
ఎల్బీనగర్, ఆగస్టు 17 (న్యూస్ ఇండియా ప్రతినిధి): వనస్థలిపురంలో భారీ వర్షం, నాలా లోకి దూసుకేళ్లిన కారు, సకాలంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించి, ఆపద్బంధువుల ముగ్గురు చిన్నారుల తో సహా కుటుంబము ప్రాణాలను కాపాడిన వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు వారి ప్రాణాలు కాపాడారు. వనస్థలిపురం ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్ జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎల్బీనగర్ వైపు కు భారీ వర్షంలో తన Hyundai Venue కారులో వెళ్తుండగా, వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతి కి కారు అదుపు తప్పి పక్కన ఉన్న వర్షపు నీటి నాలా లోకి దూసుకొని వెళ్లగా, అది గమనించిన అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు, సిఐ వెంకటేశ్వర్లు సమయ స్ఫూర్తితో వ్యవహరించి, ఆపద్బంధువుల లాగా కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబము మొత్తాన్ని సురక్షితంగా కాపాడినారు. వెంటనే అట్టి సమాచారాన్ని ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు, ఏసీపి నవీన్ రెడ్డి కి తెలుపగా వారు వనస్థలిపురం ట్రాఫిక్ అదనపు సీఐ శ్రీనివాస్ రెడ్డి తో సహా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమయస్ఫూర్తి తో వ్యవహరించిన సిబ్బంది ని అభినందించి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బంది కి తగిన సూచనలు చేసినారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాత ట్రాఫిక్ సిఐ లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి లు భారీ క్రేన్ సహాయంతో నాలా లోకి వెళ్ళిన కారు ను కూడా బయటకు తీయించినారు.
Comment List