ఐటిఐ అభ్యర్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళ

వివరాలు తెలిపిన ఐటిఐ నోడల్ ఆఫీసర్ జి రమేష్

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 3: 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ల అభ్యర్థులు  భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పరిదిలోగల వివిద పరిశ్రమలలో అప్పెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళ నిర్వహించుటకు నిర్వహించారు. ఇందు నిమిత్తము ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ముందుగా www.apprenticeshipindia.org.in నందు వారి పేరు నమోదు చేసుకొని అట్టి నకలు కాపీని, ఒక బైయో డేటా ఫామ్ ను మరియు తమ సంబందిత విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిషిప్ మేలా కు హాజరు కావలసినదిగా కోరడమైనది.భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ ప్రధానాచార్యులు, పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిదిలోని అప్రెంటిషిప్ ఖాళీల వివరాలతో ది. 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు హాజరు అవుతారు.కావున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం ప్రదాణాచార్యులు మరియు భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ నోడల్ ఆఫీసర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 109
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ జిల్లా:- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి...
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’