పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  తెలంగాణ అధ్యక్షులు  మాచన రఘునందన్..

On
పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

పాత పింఛను పథకం సాధనే ధ్యేయం 

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ 
తెలంగాణ అధ్యక్షులు 
మాచన రఘునందన్

ఎల్బీనగర్,

IMG-20240916-WA0666
ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  తెలంగాణ అధ్యక్షులు  మాచన రఘునందన్..

సెప్టెంబర్ 16 (న్యూస్ ఇండియా ప్రతినిధి): పాత పింఛను పథకమే శ్రేష్టమని, ఎన్ పీ ఎస్, యూ పి ఎస్ ఇలా ఎన్ని రకాలుగా పింఛను పథకం ను అమలు చేసినా ఉద్యోగులకు టెన్షన్ ఖాయం అని నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్) తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ అభిప్రాయ పడ్డారు. ఢిల్లీ లో సోమవారం నాడు ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమం లో రఘునందన్ దక్షిణ భారత ప్రతినిధి గా పాల్గొన్నారు .ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. ఎమ్మేల్యే, ఎంపీ లకు ఎలాగైతే పింఛను ఇస్తున్నారో అలాగే ఉద్యోగులకు ఇవ్వడం లో పాలకులకు ఉన్న ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదన్నారు.ఒకే దేశం ఒకే పెన్షన్ అని దేశం యావత్తు నినదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ గుర్తు చేశారు. ప్రతి రాష్ట్రం లో,అన్ని జిల్లాల్లో సీ పీ ఎస్, ఎన్ పీ ఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం ఉద్యమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్ ఓ పీ ఆర్ యూ ఎఫ్ జాతీయ అధ్యక్షులు బి పి రావత్, అఖిల భారత రైల్వే సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Read More ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

Views: 9

About The Author

Post Comment

Comment List

Latest News