స్వచ్ఛతా హీ సేవ
నెహ్రూ యువ కేంద్ర-ఖమ్మం
నెహ్రూ యువ కేంద్ర-ఖమ్మం ఆధ్వర్యంలో, కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ వారు ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి 16 రోజుల స్వచ్ఛతా హీ సేవ లో భాగంగా ఈరోజు కళాశాల మరియు పరిసరాలు శుభ్రపరచడం జరిగింది. నెహ్రూ యువ కేంద్రం వారు విద్యార్థులకు స్వచ్ఛత కిట్ లో భాగంగా మై భారత్ లోగో కలిగిన పెన్ , నోట్ బుక్ , క్యాప్ ఇచ్చి మై భారత్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర అకౌంట్స్ మరియు ప్రోగ్రామ్ అధికారి కమ్మర్తపు భానుచందర్, కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు కాలేజ్ ప్రిన్సిపల్ కె.వి.రమణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు విష్ణు ప్రియా, లక్ష్మణ్ రావు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కళాశాల యాజమాన్యానికి నెహ్రూ యువ కేంద్ర ధన్యవాదాలు తెలిపింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List