*జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్యానికి పాల్పడి మృతిచెందిన లకావత్ శ్రీను మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో సందర్శించిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి గారు.._*
వరంగల్ సీపీ గారితో ఫోన్లో మాట్లాడి దీనికి కారకులైన వారు ఎంతటివారైనా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పడం జరిగింది.
మృతుని బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాను అని హామీ ఇచ్చిన పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
పాలకుర్తి నియోజకవర్గం,
తేదీ:-19-10-2024
==========================
_పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శ్రీను కుటుంబ కలహాలతో నిన్న పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననికి పాల్పడగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కీ తరలించగా చికిత్చ పొందుతూ దురదృష్ట వశత్తు ఈరోజు ఉదయం మరణించారు, ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన శాసన సభ్యురాలు మార్చురీ లో ఉన్న భౌతికాయాన్ని, సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన *స్థానిక పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి గారు*_
ఈ సందర్భంగా *ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు..* మాట్లాడుతూ
_లకవత్ శీను ఆత్మహత్యయత్నానికి పాల్పడం చాలా బాధాకరం అని, ఆత్మహత్యకు కారకులు ఎవరు అనే విషయాలు తెలియవలసి ఉందని, కారకులు ఎవరైనా ఉపేక్షించేది లేదని, చట్టసంబద్ధమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని తక్షణమే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషార్ జా గారికి ఫోన్ చేసి జరిగిన సంఘటనపై ఆరా తీసి బాధితులకు న్యాయం చెయ్యాలని కోరడం జరిగింది_
Comment List