బంగారం చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

కేసుకు కీలకంగా మారిన సీసీ పుటేజులు

On
బంగారం చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

5 తులాల బంగారం ,3సెల్ ఫోన్లు,28000 నగదు రికవరీ వివరాలు వెల్లడించిన డిఎస్పి

చుంచుపల్లి (న్యూస్ ఇండియానరేష్) 22: బంగారు చోరీ కేసులో నలుగురు నిందితులను చుంచుపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా బంగారం చోరీ కేసును చాకచక్యంగా చేదించినట్లు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పి వివరాలు తెలుపుతూ.. అక్టోబర్ 9 వ తారీఖున రైటర్ బస్తీకి చెందిన వెంకటేశ్వర్లు అనే రిటైర్డ్ ఎంప్లాయ్ దసరా పండుగ సందర్భంగా బ్యాంకు లాకర్ లో ఉన్న 19 తులాల బంగారాన్ని విడుదల చేసుకున్నాడు. అనంతరం దారిలోని విద్యానగర్ కాలనీలోని ఆర్కే సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపి కిరాణా సామాన్ తీసుకొని వచ్చి వెనుక వైపు డిక్కీ ఓపెన్ చేసి కిరాణా సామాన్లు పెడుతుండగా అదే అదునుగా భావించిన తంబాల నితిష్, మరో ముగ్గురు సహాయంతో ఆటోలో వచ్చి, కారు డోర్ ఓపెన్ చేసి కార్ లో ఉన్న బంగారాన్ని అపరించుకొని అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం కారులో బంగారం చోరీకి గురిందని గమనించిన వెంకటేశ్వర్లు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.రంగంలో దిగిన పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి కదలికల పై నిఘా ఉంచి చాకచక్యంగా మంగళవారం అరెస్టు చేశారు .తంబాల నితిన్ తో పాటు నిమ్మల వినయ్, గుంజి వీరబాబు, మహమ్మద్ నయీమ్, అదుపులోకి తీసుకొని విచారించగా ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన 19 తులాల బంగారంకీ గాను , 5 తులాల బంగారం,3 సెల్ ఫోన్లో, 28000 నగదును రికవరీ చేసి, నిందితులను రిమాండ్ పంపినట్లుగా డిఎస్పి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలొ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ప్రవీణ్ ,రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Views: 221
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు
న్యూస్ ఇండియా తెలుగు. పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్ ఆగస్టు 31. పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో పలు  వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా...
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..