118 కేజీల గంజాయి పట్టివేత

రెండు ఆటోలు స్వాధీనం

On
 118 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు వ్యక్తుల అరెస్టు ..పరారీలో ఒకరు

భద్రాచలం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) అక్టోబర్ 30: ఒరిస్సా కలిమెళ్ళ నుంచి హైదరాబాద్ కు రెండు ఆటోలో గంజాయి వెళుతుందని సమాచారం మేరకు, ఎక్సైజ్  ఎన్ఫోర్స్మెంట్ మరియుఎక్సైజ్ పోలీసులు కలిసి భద్రాచలం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానంగా వచ్చినటువంటి  రెండు ఆటోలు తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయి 118 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. గంజాయి తో పాటు రెండు ఆటో లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి, వాహనాల విలువ కలిపి  రూ. 31.50 లక్షలు గా ఉంటుందని ఎక్సైజ్ సూపర్డెంట్ కరమ్ చందు తెలిపారు. అరెస్టు కాబడిన వ్యక్తుల్లో హైదరాబాద్ కు చెందిన కనిగల స్వాతిక్, మణుగూరు కు చెందిన గుంజు ఆమోస్ ను అరెస్టు చేయగా,సపావత్ వెంకన్న పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, రమేష్ పాల్గొన్నారు.గంజాయిని పట్టుకున్నటువంటి  టీమును ఎక్సైజ్  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్  విబి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్  జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య అభినందించారు.

Views: 138
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???