సాయి కృష్ణజ హిల్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే వివేకానంద

On

న్యూస్ ఇండియా తెలుగు, 09 నవంబర్ (హైదరాబాద్ బ్యూరో ) : సాయి కృష్ణజ హిల్స్ కాలనీ వాసుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వివేకానంద స్పందించారు. మియాపూర్ బొల్లారం రోడ్డులో రెండు వేల జనాభా ఉన్న కాలనీకి సరైన రోడ్డు మార్గం లేదు. ఉన్న ఒక రోడ్డు అది కూడా 40 ఫీట్స్ రోడ్డు మాత్రమే ఉంది..మరోవైపు ఇదే ప్రాంతంలో వికాస్ కాన్సెప్ట్ స్కూల్ దాదాపు 4500 పిల్లలు ఉండటం 100 బస్సులు ఉండటం వలన మిగతావాళ్ళు […]

న్యూస్ ఇండియా తెలుగు, 09 నవంబర్ (హైదరాబాద్ బ్యూరో ) : సాయి కృష్ణజ హిల్స్ కాలనీ వాసుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వివేకానంద స్పందించారు. మియాపూర్ బొల్లారం రోడ్డులో రెండు వేల జనాభా ఉన్న కాలనీకి సరైన రోడ్డు మార్గం లేదు.

ఉన్న ఒక రోడ్డు అది కూడా 40 ఫీట్స్ రోడ్డు మాత్రమే ఉంది..మరోవైపు ఇదే ప్రాంతంలో వికాస్ కాన్సెప్ట్ స్కూల్ దాదాపు 4500 పిల్లలు ఉండటం 100 బస్సులు ఉండటం వలన మిగతావాళ్ళు వెళ్ళటానికి రోడ్డు లేని దుస్థితి నెలకొంది. ముఖ్యముగా ఉదయం, సాయంత్రం పాఠశాల వేళల్లో కనీసం అత్యవసర సర్వీసులు కూడా వెళ్లలేని పరిస్థితిపై స్థానికులు ఎమ్మెల్యే వివేకానందకు మొరపెట్టుకున్నారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీకి వచ్చి పరిశీలించారు. రెండు వారాల్లోగా ప్రధాన రహదారి వరకు ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు వారాల తర్వాత మళ్లీ సందర్శిస్తానని చెప్పారు,

అదేవిదంగా కాలనీకి ప్రత్యామ్నాయ రహదారి ఆమోదం దశలో ఉందని, పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు, అది కనుక పూర్తయితే ఆ రోడ్డుకు ప్రత్యామ్నాయ 60 ఫీట్ల రోడ్డు రానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన అసోసియేషన్ కు, ఎమ్మెల్యేకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'