తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి

పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న బంధువులు 

తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి

తొర్రూరు బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి

పెద్దలకిచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడు అంటున్న బంధువులు

బాలుని కుటుంబానికి న్యాయం చేయాలంటున్న బంధువులు స్థానికులు

ఇంజక్షన్ వికటించి 9వ తరగతివిద్యార్థి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) నందు ఈరోజు మధ్యాహ్నం జరిగింది. తొర్రూరు మండలం కంటాయపాలెం దాశరోజు నాగరాణి వేణుగోపాల్ కుమారుడైన దాసరోజు సిద్ధార్థ అదే గ్రామంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు జ్వరంతో బాధపడుతున్న సిద్ధార్థ ని చికిత్స నిమిత్తం తల్లి నాగరాణి మరియు బంధువులు తొర్రూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి దావకాన)కు తీసుకొని వచ్చారు. డాక్టర్ పరిశీలించి  రక్త మూత్ర పరీక్షలు చేయించి ఇంజక్షన్ తెప్పించి ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. అప్పటిదాకా బాలుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోసుఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేని బంధువుల అర్ధనాదాలు పలువురిని ఎంతో బాధించాయి. కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులు బాలుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిఐ గణేష్ మరియు ఎస్ఐ ఉపేందర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులో ఉంచుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.

Read More అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..

Views: 2388
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ