భూభారతితో రైతులకు సత్వర న్యాయం.

భూభారతితో భూ రికార్డులు పటిష్టం. నూతన భూభారతి చట్టాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

On
భూభారతితో రైతులకు సత్వర న్యాయం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 19, న్యూస్ ఇండియా : భూభారతి చట్టాన్ని ఇతర రాష్ట్రాల,  రెవెన్యూ చట్టాలను పరిశీలించి దాదాపు రెండు సంవత్సరాలుగా చాలామంది మేధావులు, రైతులు, రైతు సంఘాల నాయకులను సంప్రదించిన అనంతరం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలియచేసారు. పుల్కల్ మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భూభారతి 2025 చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భూభారతిపై రెవెన్యూ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 14 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున నూతన భూ చట్టానికి శ్రీకారం చుట్టిందన్నారు. భూభారతి రైతుల భూ సమస్యలు త్వరితగతిన సులభంగా పరిష్కరించబడతాయన్నారు. భూభారతిలో చాలా సులభతరంగా రైతు సమస్యల్ని పరిష్కరించవచ్చున్నారు. రికార్డులో పేరు మార్పు, నూతన పౌతి లాంటివి 30 రోజుల్లో పరిష్కారం అవుతాయన్నారు. భూ రికార్డుల్లో పేరు మార్చడం కోసం నూతన నోటీసు విధానం అమలులో ఉందన్నారు. గత భూ చట్టాల్లో ఈ నోటీసు విధానం లేదని గుర్తు చేశారు.
 రైతుకు ఏదైనా భూ సమస్య వచ్చినప్పుడు స్థానిక తహసిల్దార్ ద్వారా పరిష్కరించవచ్చని, తాహాసిల్దార్ సమాధానానికి  తృప్తి చెందని రైతు, ఆర్డిఓ ద్వారా పరిష్కరించవచ్చు అన్నారు. ఒకవేళ ఆర్డీవో ద్వారా  పరిష్కారం  కాని యెడల కలెక్టర్ కు సమస్య విన్నవించవచ్చని, కలెక్టర్ ద్వారా కూడా   కాని యెడల  రైతు ల్యాండ్ ట్రిబ్యునల్ లో పరిష్కారం దొరికేలా ఈ చట్టంలో అవకాశాలున్నాయన్నారు. రైతుకు భూ సమస్యలను రెవెన్యూ కోర్టు ద్వారానే పరిష్కారం అయ్యేలా ఈ చట్టం లో ఉందన్నారు. రైతు సమస్యకు ఒక నెల నుంచి రెండు నెలల లోపల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులకు భూభారతి చట్టంపై ఎలాంటి సందేహాలు ఉన్న నీవృత్తి చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. అనంతరం పుల్కల్ మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగదిని, స్టోర్ రూమ్ పరిశీలించారు. మెనూ అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా మెనూ అమలు చేయాలని కస్తూరిబా పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, రైతు సంఘం నాయకులు, రైతులు,రెవెన్యూ అధికారులు,వ్యవసాయఅధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-19 at 4.34.10 PM

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'