నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని టి యు డబ్ల్యూ జే ఎన్నికలు ఏకగ్రీవం
న్యూస్ ఇండియా తెలుగు మే 14 : నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నికలు టి యు డబ్ల్యూ జే నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషరాజు వీరస్వామి, కార్యవర్గ సభ్యులు చెరుకు సైదులు, బెల్లి శంకర్, రహీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ ఎన్నికల భాగంగా ఏకగ్రీవంగా మండల అధ్యక్షులు కొల్లు నరేష్, ప్రధాన కార్యదర్శి గట్టు లక్ష్మీకాంత్ ఉప ప్రధాన కార్యదర్శి పందాల వెంకట్ ఉపాధ్యక్షులు. అంబేద్కర్,వీరేందర్,రవీంద్ర చారి,శేషు కోశాధికారి మరాటి నరసింహ కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తమ ఎన్నికలకు సహకరించిన నల్గొండ జిల్లా టి యు డబ్ల్యూ జె కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నకిరేకల్ మండల పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు, అక్రిడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు, జర్నలిస్ట్ పై జరిగే దాడులపై ముక్తకంఠంతో ఎదుర్కొని సమస్యలు పరిష్కరిస్తానని అధ్యక్షులు కొల్లు నరేష్ తెలియజేశారు.
Comment List