చికెన్ బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను అని రెస్టారెంట్ యజమాని...

On
చికెన్ బిర్యానిలో బల్లి..

బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను... రెస్టారెంట్ యజమాని..

IMG-20250515-WA0635
బిర్యానీలో బల్లి..

ఇబ్రహీంపట్నం, మే 15, న్యూస్ ఇండియా ప్రతినిధి: రెస్టారెంట్ లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు/ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్డు లో ఉన్న మై పిల్ ప్యామిలీ రెస్టారెంట్ లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణ రెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోగా వచ్చిన తర్వాత బిర్యానీ ని తినడం మొదలుపెట్టారు. బిర్యానీ లో బల్లి కనిపించడం తో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. తర్వాత తేరుకొని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నిలదీయగా ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ మేనేజర్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Views: 50

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..