ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

By Khasim
On
ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

న్యూస్ ఇండియా ఒంగోలు:

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల కాంగ్రెస్ స్థాపన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైపు వెంకటకృష్ణా రెడ్డి కేక్ కట్ చేయడం ద్వారా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కైపు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ – కె కె సి అనేది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిన ఒక విశిష్ట విభాగమని, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం ఈ విభాగం నిరంతరంగా పోరాడుతోందని తెలిపారు. కూలీలు, డైలీ వేజ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హోటల్ కార్మికులు వంటి వర్గాల కోసం కేకేసీ అంకితభావంతో పనిచేస్తోందన్నారు. IMG-20250801-WA1079రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కె కె సి కార్యకలాపాలు బలోపేతం చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 50 మంది కార్యకర్తలను నియమించి ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామని వివరించారు. యువత ఈ ఉద్యమానికి బలంగా నిలవాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పాలపర్తి విజేష్ రాజ్ మాట్లాడుతూ కె కె సి ఉద్యమం డా. బి.ఆర్. అంబేద్కర్ గారి న్యాయబద్ధ సిద్ధాంతాలు, ఇందిరా గాంధీ మరియు రాహుల్ గాంధీ గారి దూరదృష్టితో పాటు వైఎస్ షర్మిల గారి ప్రేరణతో ముందుకు సాగుతోందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో గౌరవం, గుర్తింపు, భద్రత కల్పించడమే ఈ ఉద్యమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమ పాలపర్తి విజేష్ రాజ్ (రాష్ట్ర యువ కాంగ్రెస్ కార్యదర్శి మరియు యర్రగొండపాలెం నియోజకవర్గ కోఆర్డినేటర్), టీ. సుధీర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), గొరంట్ల కోటేశ్వరరావు (జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు), ఇరిగినేని నర్సయ్య (జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి) తదితర నాయకులు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి  దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసిన పెద్దమ్మతల్లి పాలకమండలి 
కొత్తగూడెం(న్యూస్ఇండియాబ్యూరో నరేష్): పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయ పాలకమండలి సభ్యులు, ఈఓ తో కలిసి దేవదాయ శాఖ డైరెక్టర్ ను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం...
ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల
బాల కార్మిక వ్యతిరేకంగా (నిషేధంపై)అవగాహన కార్యక్రమం..
రేషన్ కార్డు అనేది ఒక పత్రం కాదని, ఆత్మగౌరవ పత్రం...
గ్రామ పంచాయతీ నిర్మాణం స్మశాన వాటిక పక్కన నిర్మించొద్దు..
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..