జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లోనీ
జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో నీ విద్యార్థులకు 'టై బెల్టు ఐడి కార్డు' ల పంపిణీ
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులను తయారు చేస్తున్న యాజమాన్యం.
న్యూస్ ఇండియా తెలుగు,
ఆగస్టు 29,
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘపురం రంజిత్ కుమార్,
పాలకుర్తి నియోజకవర్గం దర్దేపల్లి గ్రామంలో నీ విద్యార్థులకు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలకు సంబంధించిన 'టై, బెల్ట్ " ఐడి కార్డు లను విద్యార్థులకు అందజేసిన అదే స్కూల్లో పనిచేస్తున్న రజిత గారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా చదువును అందించడమే గాక వారికి తన సొంత డబ్బులతో వాటిని అందజేయడం జరిగింది.అంతేగాక ఆ గ్రామం లోని జలగం డాక్టర్ కృష్ణ గారు (చెత్త కుండీలను) మరియు ప్రతిరోజూ ఉదయం పాఠశాలలో ప్రేయర్ (ప్రార్థన) చేసే సమయం లో(డోలు) పగలడం చూసిన అతను తన సొంత ఖర్చుతో వారి తల్లి దండ్రులు జలగం డాక్టర్ సాయిలు, డాక్టర్ఎల్లమ్మ, గార్ల జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది.దీనిపై ఆ పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశం గారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ చదువులనూ మరియు స్పోర్ట్స్ వంటి వాటిలో ముందుంచి వారిని అన్ని విధాల మా పాఠశాల ను మరింత ముందుకు తీసుకుపోతామని ఇలాంటివి ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో మరింత నూతన ఉత్తేజాన్ని" పెంపొందించుకుంటారని,ఇవి డొనేట్ చేసిన దాతలకు పాఠశాల యాజమాన్యం తరుపున శాలువల తో సన్మానించి వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Comment List