ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
దారిలోనే సెటిల్ మెంట్.. ఆఫీస్ కు రాగానే సిజ్ చేసిన పరికరాలు కారులో తరలింపు..
అక్కడ సీజ్..
ఇక్కడ రిలీజ్..? డీల్ ఒకే....

ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతికి పరాకాష్ట..
దారిలోనే సెటిల్ మెంట్.. ఆఫీస్ కు రాగానే సిజ్ చేసిన పరికరాలు కారులో తరలింపు..
సర్కిల్ - 3 పరిధిలో వింత నాటకం..
టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి నిదర్శనం..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ సెప్టెంబర్ 16 న్యూస్ ఇండియా ప్రతినిధి: జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ పరిధిలో అవినీతి రాజ్యమేలుతుందని అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ అక్రమ నిర్మాణం పై ఫిర్యాదులు రావడంతో వక్రమ నిర్మాణంపై చర్యలకు ఉపక్రమించారు. ఎందుకంటే..? ఎటువంటి అక్రమ నిర్మాణమైన ముడుపులు ముడితే వాటి జోలికి వెళ్ళని అధికారులు సదురు అక్రమ నిర్మాణ దారుడు అడిగినంత ముట్ట చెప్పకపోవడంతో ఆగమేఘాల మీద హయత్ నగర్ బొమ్మల గుడి దారిలోని అక్రమ నిర్మాణం వద్దకు వెళ్లారు. ప్రభుత్వ వాహనాన్ని, సిబ్బందిని, రవాణా ఖర్చును భరిస్తూ వెళ్లి రాడ్ కట్టర్ మిషిన్ తో పాటు ఇనుము నువ్వంటే పరికరాలు ఇతర సామాగ్రిని సీట్ చేసి డీసీఎం వాహనంలో బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ... దారిలోనే వీరికి డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. వాహనం సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోగానే అప్పటికే డీల్ కుదిరిన సదరు అక్రమ నిర్మాణదారుడి కారు అక్కడే పార్క్ చేసి ఉంది. దీంతో టౌన్ ప్లానింగ్ సర్కిల్ -3 అధికారుల ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిమాలేషన్ సిబ్బంది సీట్ చేసిన పరికరాలను కారులో తరలించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి..!
Comment List