గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు
పరిమితికి మించి గ్రానైట్ బండరాయి తరలింపు
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం
నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలు
పట్టించుకోని సంబంధిత అధికారులు
-ప్రమాదాలకు జాతీయ రహదారిపై గుంతలే కారణం..
-నాణ్యతలేముతో గుంతలం పూడుస్తున్న కాంట్రాక్టర్
-కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన ఆర్ అండ్ బి అధికారులు
గ్రానైట్ లారీలు జాతీయ రహదారుల పై భీభత్సం సృష్టిస్తూ ప్రభుత్వం ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాలు జరుగుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు..తోర్రూర్ పట్టణ కేంద్రంలో పోలిసు అమరవీరుల దినోత్సవం రోజున తోర్రూర్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జరిగిన గ్రానైట్ లారీ ప్రమాదం మరువకముందే సోమవారం మహబూబాబాద్ జిల్లా తోర్రూర్ మండలం నాంచారి మడూరు గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంట్లోకి గ్రానైట్ లారీ దూసుకేళ్ళింది. ఇంటికి ముందు భారీ వృక్షం ఉండటంతో పెద్ద స్థాయిలో ప్రాణ నష్దింటం జరుగలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం లో ఉదయం లేచి పని చేస్తున్న మహిళ పై ఫీల్లర్గా బాక్స్ పడటంతో పక్కన ఉన్న మహిళ పై పడి కాలు విరిగింది .దిండుతో మహిళను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్గ కూడా గాయాలైనట్లు తేలుస్తోంది.గతంలో తోర్రూర్ పట్టణ కేంద్రంలో గ్రానైట్ లారీ డివైడర్ డికోట్టడంతో మూడు బండరాయి లు జాతీయ రహదారి పై పడి డివైడర్ 20 మీటర్ల మేర ధ్వంసం అయింది.స్థానిక పోలిసులు చోరవ తీసుకోని జూమిలియన్ కంపెనికి చెందిన క్యూ వై 80 వి అనే 80 టన్నుల సామర్థ్యం గల క్రేన్ తో బండరాయి లను తోలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహానాల రాకపోకలతో రహదారిపై రద్దిగా ఉంటుంది.ఈ నేపథ్యంలో గ్రానైట్ లారీ లు పరిమితికి మించి గ్రానైట్ బండరాయి లను తరలిస్తు ,మద్యం సేవించి డ్రైవర్ నిద్రమత్తు లో ఉండి అతివేగంతో అజాగ్రత్తగా నడుపుకుంటూ ప్రమాదాలు చేస్తున్నారు.ఇది గ్రానైట్ లారీలకు పరిపాటీగా మారింది.ప్రభుత్వ ధనాన్ని ధ్వంసం చేసిన ,ప్రజల ప్రాణాలు తీసిన గ్రానైట్ లారీ ల పరిమీట్ క్యాన్సల్ చేసి లారీలను సీజ్ చేయాల్సిన అధికారులు మాముళ్ళ మత్తులో తేలియాడుతున్నరనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయిప్రమాదం జరిగి పదిహేను రోజులు అవుతున్నా డివైడర్ ను పునరుద్ధరించక పోవడం అధికారుల పనితీరు కు నిదర్శనమని పలువురు అనుకుంటున్నారు.రాత్రి, తెల్లవారుజామున ప్రమాదాలు జరగడంతో ఏలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పట్టపగలు ప్రమాదం జరిగితే ప్రజలు ప్రాణాలు కోల్పోయి రహదారి రక్తసిక్తయ్యేదని నిపుణులు చెబుతున్నారు.
ఏదేమైనప్పటికీ ప్రజల ప్రాణాలను దృష్టి లో ఉంచుకొని పరిమితికి మించి గ్రానైట్ బండరాయి లను తరలిస్తున్న లారీ లను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ రహదారిపై రహదారిపై గుంతలు ;
వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై గుంతలు ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఒక నెలలో దాదాపు రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్న ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదు.
సంవత్సరం లో ఒకేసారి నామమాత్రంగా నాణ్యత లేమితో గుంతలను పూడ్చి వదిలేస్తున్నారు .సదరు కాంట్రాక్టర్ వద్ద ఆమామ్యాలు తీసుకోని సైలెంట్ గా ఉంటున్నని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comment List