కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి

వైఎస్సార్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్

By Khasim
On
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి

న్యూస్ ఇండియా, కనిగిరి,నవంబర్09:

 

మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,కోటి సంతకాలతో కూటమి కుట్రలు తిప్పికొట్టి ప్రజలకు మేలు చేసే మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం అని కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన "కోటి సంతకాల సేకరణ రచ్చబండ" కార్యక్రమం ఆదివారం కనిగిరి పట్టణం 11వ వార్డు కాశిరెడ్డి కాలనీలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టం,కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం గురించి ప్రజలకు వివరించారు.మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ ప్రజలతో సంతకాలు సేకరించారు.. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించే మహోన్నత లక్ష్యంతో వైయస్ జగన్ మెహన్ రెడ్డి గారు రాష్ట్రం లో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.అందులో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తియ్యాయన్నారు.మిగతా వాటిని పూర్తి చేసి పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు,నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేయాల్సిన కూటమి ప్రభుత్వం దోపిడీకి సిద్దమైందని మండిపడ్డారు.మెడికల్ కళాశాలలను పూర్తి చేస్తే వైయస్ జగన్ గారికి మంచి పేరు వస్తుందని రాజకీయ కారణంతో పీపీపీ అంటూ నిరుపేదలకు తీరని అన్యాయం చేస్తోందని ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులుకనిగిరి మండలం వైసిపి అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, మాణిక్యరావ్, పిల్లి లక్ష్మీనారాయణ, గోవర్ధన్ రెడ్డి,ఆవుల భాస్కర్ రెడ్డి, తమ్మినేని సుజాత, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి,భూమిరెడ్డి కొండారెడ్డి, శీలం సుదర్శన్, పరిమి వెంకటరావు, మూలే రాజశేఖర్ రెడ్డి,పరుచూరి రమేష్, అత్యాల ఇస్సాకు, నాగేశ్వరరావు, రమణయ్య, వెంకట్రావు,మాధవ్, మహేష్, కృష్ణ,అబ్రహం లింకన్,దాదిరెడ్డి మాలకొండ రెడ్డి,నాగమణి, సిద్ధారెడ్డి,మాలి,చింతం శీను, దాసరి మురళి, రామనబోయిన శీను, ఎర్రబెల్లి దేవరాజు,మాలకొండ రెడ్డి, సంభిరెడ్డి, సంగటి మహేంద్ర, మడతల వెంకటరెడ్డి, కస్తాల బాలాజీ గంజి రవీంద్రారెడ్డి, అబ్రహం లింకన్, దాదిరెడ్డి మాలకొండ రెడ్డి, నాగమణి, సిద్ధారెడ్డి మాలి, గంజి రవీంద్రారెడ్డి, మున్నా సుబ్బారెడ్డి, ఏరువారిపల్లి జగన్, శ్రీకాంత్, కృష్ణారెడ్డి, సుస్మిత, జిలాని, భాస్కర్ ,షకీలా ,భారతి, పర్వీన్, శ్రీకాంత్, మల్లేశ్వరి ,రాధా పెద్ద తిరుపతయ్య,శివ నాగరాజు,తదితరులు పాల్గొన్నారుIMG-20251109-WA1383.

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు