ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...

On
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై కిలో మీటర్లు పాదయాత్ర కోసం  సిద్ధమయ్యారు.ఈ నెల "17 వ తారీకు నుంచి పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ తో చేసే *పాదయాత్ర "లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు మాజీ ఐ.ఏ.ఇస్ ఆఫీసర్  చిరంజీవులు  చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ ఆ పైస్థాయి ప్రైవేటు కాలేజీలు అన్ని మూతపడి.ఆ కాలేజీల యాజమాన్యాలు సమ్మెబాట పట్టి చాలా రోజులైంది ఆ యాజమాన్యాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తొమ్మిది వందల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయమనీ అడుగుతున్నారు.ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటున్నారు, ఇంకా రావలసిన బకాయలు గురించి ఆ తర్వాత ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు, వారి పరీక్షలు ఇవేవీ వాళ్లకు పట్టడం లేదు ఈ దేశాన్ని నిర్మించే  అటువంటి విజ్ఞానాన్ని నేర్పేటువంటి విద్యాసంస్థలు,  అక్కడ నేర్చుకునే విద్యార్థులు గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ కూడా ఇంట్రెస్ట్, అవసరం లేదు అనుకుంట కేవలం తమ స్వార్థం కోసం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే తమకు అవసరమైన వాటిని మాత్రమే పట్టించుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ దాదాపు 40 శాతం ఉన్నటువంటి యువత ఇలాంటి వాటి గురించి తప్పకుండా ఆలోచించాలి అని  , చాలా మంది పేద విద్యార్థులు సర్టిఫికేట్ కోసం మొత్తం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్ లు ఇస్తున్నారు అని  చెప్తున్నారు.నా పాదయాత్ర చూసి అయిన ప్రభుత్వం నికి సిగ్గు రావాలి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,  బీసీ.ఐ.ఎఫ్.చైర్మన్ మాజీ ఐ.ఏ.ఎస్.చిరంజీవులు ,మాజీ డీజీపీ ఐ.పి.ఎస్ డా.పూర్ణ చందర్ రావు ,ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ , మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఇరవర్తి , బీసీ కళాకారులు రామలింగం , డప్పు స్వామి, ఉస్మానియా పి.ఎచ్.డి.ఆవారా వేణు , హెచ్.సి.యు తెలుగు ప్రొఫెసర్  పిల్లలమర్రి రాములు , బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ , దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు ఆయిల వెంకన్న గౌడ్ , మహిళా అధ్యక్షులు వసుమతి వరకల, పద్మశాలి వెంకన్న నేత, జి.మురళి యాదవ్ , జ్ఞానేశ్వర్ రాపోలు దయాకర్, బీసీ యువ నాయకులు బైరీ శేఖర్ , కె.వెంకటయ్య గౌడ్ , పిడికిలి రాజు ,శివ యాదవ్, లక్ష్మణ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు