నిమోనియాను నివారిద్దాం..

నవంబర్ 12 ప్రపంచ నిమోనియా డే..

On
నిమోనియాను నివారిద్దాం..

నిమోనియాను నివారిద్దాం

Screenshot_2025-11-11-20-52-56-50_680d03679600f7af0b4c700c6b270fe7
నిమోనియాను నివారిద్దాం..

కరోనా అనంతరం నిమోనియా(న్యుమోనియా)తో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి.  మన ఊపిరితిత్తులలో అల్వియోలీ అనే చిన్న చిన్న గదులుంటాయి.  మనం గాలి పీల్చుకొన్నపుడు ఈ గదులలో గాలి నిండుతుంది.  అయితే నిమోనియా వచ్చిన వ్యక్తిలో మాత్రం ఈ గదులలో గాలి బదులు వైరస్ తో నిండిన ద్రవపదార్థం చేరడం వలన మనం గాలి పీల్చుకోవడం కష్టమవడమే కాకుండా తీసుకొనే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోతుంది.  అంతే గాకుండా ఈ వ్యాధి కారణంగా గాలి గదులలో వాపు ఏర్పడుతుంది.  దీంతో ఊపిరి ఆడకపోవడం, దగ్గు, జ్వరం, ఊపిరితిత్తులలో నొప్పి, చలి మరియు అలసట లాంటివి వస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ఏటా 450 మిలియన్ (45 కోట్లు) ప్రజలు నిమోనియా బారిన పడుతుంటే అందులో 4 మిలియన్ల (40 లక్షలు) ప్రజలు మరణిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులలో వచ్చే అతి పెద్ద అంటువ్యాధి ఇదే. 2017 గణాంకాల ప్రకారం 8,08,694 మంది 5 సంవత్సరముల లోపు చిన్నారులు మరణించారు. ఇది 5 సంవత్సరముల లోపు చిన్నారుల మరణాలలో 15 శాతంగా పేర్కొనబడింది.2019లో ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా కారణంగా సుమారు 25 లక్షల మంది మరణించారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలు, వృద్ధులు ఇద్దరూ సులభంగా నిమోనియాకు గురవుతారు. పిల్లలు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వీరికి న్యుమోనియా త్వరగా ఎటాక్‌ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్సిరేటర్‌ సిన్సిషియల్‌ వైరస్‌(ఆర్‌ఎస్‌వీ), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ వలన వచ్చే జలుబు, దగ్గు తర్వాత న్యుమోనియా తరచుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read More ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

నిమోనియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోయలిషన్ 2009 నవంబర్ 12 న మొదటిసారిగా ప్రపంచ న్యుమోనియా డేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది 'ప్రపంచ నిమోనియా డే' జరుపుతున్నారు. న్యుమోనియా గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

2025 సంవత్సరానికి ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని పిల్లల మనుగడ అనే థీమ్ తో జరుపుతున్నారు.మరొక నివేదిక ప్రకారం శ్వాసను తిరిగి తీసుకురావడం: ప్రతి శ్వాస ముఖ్యం అనే నినాదంతో కేంద్రీకరించబడింది.  న్యుమోనియా వ్యాధిని అరికట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటును తగ్గించడంపై దృష్టి పెడుతుంది, ఎందుకంటే న్యుమోనియా పిల్లలకు ప్రాణాంతకమైన అంటువ్యాధి.

ఎక్స్-రే, రక్త పరీక్ష, కఫ పరీక్ష, ఛాతీ సిటి స్కాన్, బ్రోంకోస్కోపీ వంటి పరీక్షలతో.. నిమోనియాను నిర్ధారణ చేయవచ్చు.న్యూమోనియాను ఇంట్లోనే టెస్ట్‌ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ పల్స్‌ ఆక్సిమీటర్‌తో గుర్తించవచ్చు. పల్స్‌ ఆక్సిమీటర్‌ మన రక్తంలో ఆక్సిజన్‌ లెవల్‌ను మెజర్‌ చేస్తుంది. నిమోనియా కారణంగా.. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉంటాయి.పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు.బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకూ తల్లిపాలు ఇవ్వడం, చక్కని శుభ్రత పాటించడం వలన చిన్నారుల్లో నిమోనియా రాకుండా చాలా వరకూ నివారించవచ్చు
ఆల్కహాల్‌, స్మోకింగ్‌ అలవాటు ఉంటే వెంటనే మానేయాలి.
పొగకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి.
రోజు వ్యాయామం చేయడం మంచిది.పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.అదే విధంగా చలి కాలంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాణా సంచాకు దూరంగా ఉంటే మంచిది.అదే విధంగా న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) వంటి టీకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.


యం. రాం ప్రదీప్
జేవివి సభ్యులు, తిరువూరు
9492712836

Views: 1

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నిమోనియాను నివారిద్దాం.. నిమోనియాను నివారిద్దాం..
నిమోనియాను నివారిద్దాం నిమోనియాను నివారిద్దాం.. కరోనా అనంతరం నిమోనియా(న్యుమోనియా)తో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక అంటువ్యాధి....
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి