మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.
మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.
.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, మార్చి 28, న్యూస్ ఇండియా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేట గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల రథోత్సవం ఘనంగా జరిగింది. గ్రామంలోని వాడవాడలా స్వామివారి ఊరేగింపు నిర్వహించడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, సీతారాముల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామంపై ఎల్లప్పుడూ శ్రీరాముని కృప ఉండాలని ఆకాంక్షించారు. భక్తి వాతావరణంలో సాగిన ఈ రథోత్సవం గ్రామానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలూరి నరేష్, ఉపసర్పంచ్ పంతం మల్లేష్, తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్, జ్యోతి చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి, కాకి రాములు, ఢిల్లీ వెంకటేష్, కాకి నరసింహ, కాకి సంతోష్ కుమార్, మదన్ పాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, పాల జనార్ధన్, రాములు, బొమ్మరాజు, పంతం మధు, వీరారెడ్డి, పలుసు బాలకృష్ణ, గుండు నరసింహ, సాయిలు, పంతం పాండు, అశోక్, పాల జంగయ్య, యాదయ్య, జాంగిర్, ఆలూరి జంగయ్య, పంతం బాబు, వెంకటరమణరావు, కాకి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.

Comment List