మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
On
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు పాల్వంచ నందు ఘనంగా యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మేరా యువ భారత్ గురించి యువత కు వివరించి, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలను యువతకు తెలియజేసి వారిని ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, మేరా యువ భారత్ అకౌంట్స్ మరియు పోగ్రామ్ ఆఫీసర్ కే. భానుచందర్ యూత్ క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
28 Mar 2026 21:50:40
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు పాల్వంచ నందు ఘనంగా యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది....

Comment List