మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ వారి సహకారంతో శ్రీ సాయి గణేష్ యూత్ క్లబ్ వారు దుమ్ముగూడెం మండల్ బి కొత్తగూడెం గ్రామం నందు ఘనంగా యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మేరా యువ భారత్ గురించి యువత కు వివరించి, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలను యువతకు తెలియజేసి వారిని ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి.కొత్తగూడెం సర్పంచ్ కె. ప్రమీల, ఎఫీకోర్ యూత్ డెవలప్మెంట్ ధర్మరాజు, సావిత్రి మరియు యూత్ క్లబ్ అధ్యక్షులు కే. ఉష, బి. మురళీకృష్ణ, ఎస్.కె లాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List