కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
జాయింట్ కలెక్టర్ ను సత్కరించిన ఆర్యవైశ్య సంఘం నేతలు
ప్రభుత్వం వేడుకలు జరపటం పట్ల హర్షం
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఏప్రిల్ 26:వైశాఖ శుద్ధ దశమినాడు కలెక్టర్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ప్రభుత్వ ఘనంగా నిర్వహించిది. ఆదివారం ఆర్యవైశ్య కుల దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క జయంతి ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా పండుగ జరుపుకోవాలని ఆదేశించిన మేరకు జిల్లా కొత్తగూడెం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. అధికారుల సూచనల మేరకు ఆర్యవైశ్య సంఘాల నేతలతొ కలెక్టర్ ఆఫీస్ నందు అమ్మవారి పూజ, కన్యకా పరమేశ్వరి అమ్మ వారు ఈ భూమిపై ఎలా అవతరించినది వక్తలు తమ ఉపన్యాసం ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కన్యకా అమ్మవారి ఫోటోలు జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పూల మాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతేగాక ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్యవైశ్యలందరికి చేసి చేతులు మీదుగా అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ను చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొదుమూరు శ్రీనివాసరావు, ఆర్యవైశ్య అన్నదాన సత్రం అధ్యక్ష కార్యదర్శులు కంభంపాటి రమేష్, మిట్టపల్లి పాండురంగారావు, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా నగేష్, జిల్లా మహాసభ అధ్యక్షులు దారా రమేష్, 51 డివిజన్ కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పూల బొకేను అందించి
శాలవతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ, చొక్కా లక్ష్మణరావు, గుడాల అచ్యుతరావు, కొయ్యడ నగేష్, కూర శ్రీధర్, వారణాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comment List