మైనింగ్ మాయాజాలం..
ఎస్వి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నుండి అక్రమంగా మట్టి తరలింపు
మైనింగ్ మాయాజాలం..
ఎస్వి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నుండి అక్రమంగా మట్టి తరలింపు
పోలీసులు లారీలను పట్టుకున్నాక వే బిల్లులు జనరేట్ చేసిన మట్టి మాఫియా
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, మే 12 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను ఇబ్రహీంపట్నం (బ్లూకార్ట్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం హయత్ నగర్ లో ఎస్వి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ నుండి ఇబ్రహీంపట్నం వైపు మట్టి లోడుతో వస్తున్న 0TS07U9855, TS07UE0599 గల రెండు టిప్పర్ లారీలను మంగళ్ పల్లి చర్చ్ వద్ద నిలిపి, లారీ డ్రైవర్లను అడగగా ఎలాంటి అనుమతులకు సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని చెప్పారు. దీంతో లారీలను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలిస్తుండగా, మార్గం మధ్యలో మళ్లీ అనుమతులు ఉన్నాయంటూ వేబిల్ లు వాట్సప్ చేసి ఇదిగో అనుమతులు అంటూ చూపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. పోలీసులు లారీలను పట్టుకున్నప్పుడు లేని వే బిల్లులు, తప్పించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా.. అప్పటికప్పుడు మైనింగ్ లాగిన్ నుంచి వే బిల్లులను జనరేట్ చేసి, వాట్సప్ చేశారు. లారీలను పోలీసులు పట్టుకున్నప్పటికీ సమయం మధ్యాహ్నం 01.01 నిమిషాలు. మైనింగ్ లాగిన్ నుంచి జనరేట్ అయిన వేబిల్ లో సమయం మధ్యాహ్నం 01:05 నిమిషాలు. అంటే ఇక్కడ పోలీసులు పట్టుకున్న తర్వాతే లారీలకు వే బిల్లులు ఇవ్వడం జరిగింది.
అయితే ఈ వే బిల్లులు బ్లూకార్ట్ పోలీసులకు చూపించి మట్టి మాఫియా మట్టి లారీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లకముందే ఎలాంటి కేసు కాకుండా జాగ్రత్తపడుతూ తెలివిగా తప్పించుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డుపై మట్టి తరలిస్తూ ఇటు పోలీసులను, అటు మైనింగ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comment List