కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకుడు పిల్లి శ్రీనివాస్ యాదవ్ ముందస్తు అరెస్టు – ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకుడు పిల్లి శ్రీనివాస్ యాదవ్ ముందస్తు అరెస్టు – ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జూన్ 06, న్యూస్ ఇండియా ప్రతినిధి: కొహెడ సర్వే నెంబర్ 167లో దశాబ్దాలుగా భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయం అని బీజేపీ నాయకుడు పిల్లి శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అదే ప్రాంతంలో ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో రైతుల తరఫున ప్రశ్నిస్తామనే భయంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా నిర్బంధాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి పర్యటనను సాకుగా చూపుతూ, కొహెడ రైతుల పక్షాన పోరాడుతున్న బీజేపీ నాయకులను హయత్‌నగర్ పోలీసులు శనివారం
తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్టు చేయడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయించి ప్రజాస్వామ్య గొంతులను అణచివేయాలని చూస్తే సహించబోమన్నారు.
బీజేపీ ప్రధాన డిమాండ్లు:
• కొహెడ సర్వే నెం.167 బాధిత రైతులకు తక్షణమే న్యాయబద్ధమైన పూర్తి నష్టపరిహారం చెల్లించాలి.
• రైతులకు న్యాయం జరిగే వరకు ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు, శంకుస్థాపన కార్యక్రమాలను నిలిపివేయాలి.
• హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులను వెంటనే ఆపాలి.
రైతుల హక్కుల సాధన కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా రైతుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని పిల్లి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హయత్‌నగర్ పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.

Comment List