చుంచుపల్లిలో అనుమతి లేని నిర్మాణాలు
ప్రజా ప్రతినిధి కనుసనలల్లో కట్టడాలు
నోటీసులు ఇచ్చిన బేకాతర్
చుంచుపల్లి: చుంచుపల్లి మండల పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి . గ్రామ పంచాయతీ లేదా సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా పలుచోట్ల నివాస, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో పట్టణ ప్రణాళిక, డ్రైనేజీ, రహదారులు, ప్రజా సౌకర్యాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో చుంచుపల్లి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇకపై అనుమతులు లేకుండా కొత్త నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comment List