*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *

విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని వికాస్ హై స్కూల్ కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు.

 డివిజన్ కేంద్రంలోని వికాస్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.

     విద్యార్థులకు నమూనా పోలింగ్‌ నిర్వహించి, తద్వారా ఓటింగ్‌, ఎన్నికల విధానం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. తొర్రూరు కౌన్సిలర్లు పలువురు విద్యార్థులు నామినేషన్లు వేయడంతో పాటు బ్యాలెట్‌ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్ని కల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవ గాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.

        ఈ సందర్భంగా కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ... ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని, భవిష్యత్తులో విద్యార్థులే దేశానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఎన్నికల విధానం తెలియడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ రేవూరి వెంకన్న, డైరెక్టర్ కేవీ రెడ్డి, విజయభాస్కర్, శ్రీలత, ప్రిన్సిపాల్ వేణుమాధవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 53
Tags:

Post Comment

Comment List

Latest News

కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్  కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 22 :ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డిఎస్పి ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్  పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పోస్ట్...
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్