వినూత్న రీతిలో వినాయక నిమజ్జనం

ఆటపాటలతో సాగిన గణనాథుని నిమజ్జనం

వినూత్న రీతిలో వినాయక నిమజ్జనం

IMG-20230925-WA0763   యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చాడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉత్సవాలను ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జన కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు. గణనాధుని వినూత్న రీతిలో అనగా జెసిబి యొక్క ముందు భాగంలో ఉండే డోజర్ లో విగ్నేశ్వరుని ప్రతిష్టించి నిమజ్జనం కార్యక్రమం సాగించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మహిళలు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి కోలాటం ఆటలు, బతుకమ్మ పాటలు,డీజే చప్పుళ్ల మధ్య నృత్యాలు ఆనందోత్సాహాల మధ్య రంగురంగుల కలర్లు చల్లుకుంటూ డాన్సులు సాగించారు. యువకులు కేరింతలతో డీజే తీన్మార్ స్టెప్పులతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ గణనాధుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవళ్ళ పరశురాములు,హేమంత్, దేవల్ల వెంకన్న శ్రీకాంత్ ఉపేందర్ మురళి ఎలేందర్ అనిల్, ఆవనగంటి అనిల్ ,భూదేవి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 259
Tags:

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.